‘దళితబంధు’ దేశానికి ఆదర్శం

ABN , First Publish Date - 2022-03-06T05:13:44+05:30 IST

సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శమంటూ అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు.

‘దళితబంధు’ దేశానికి ఆదర్శం


అల్లాదుర్గం, మార్చి 5: సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శమంటూ అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. శనివారం అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్‌ ఓ ఫంక్షన్‌హాల్‌లో దళిత బంధు, మన ఊరు-మన బడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దళితబంధు పథకాన్ని అమలు చేసి, ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షలు అందిస్తున్నారన్నారు. పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పొందాలని కోరారు. మనఊరు-మనబడితో పాఠశాల రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములుగా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, మాజీ ఎంపీపీ కాశీనాథ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నర్సింహులు పాల్గొన్నారు.

Read more