ఉమ్మడి జిల్లాలో11మందికి కరోనా

ABN , First Publish Date - 2022-08-16T06:02:04+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 11 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు సంబంధిత వైద్యాధికారులు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో11మందికి కరోనా

మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి అర్బన్‌/సిద్దిపేట, ఆగస్టు 15: ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 11 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు సంబంధిత వైద్యాధికారులు తెలిపారు. సోమవారం మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 98 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించగా ఐదుగురికి కరోనా సోకింది. మెదక్‌లో 2, తూప్రాన్‌ 2, రామాయంపేట ఒకరికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యిం ది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 33 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా నలుగురికి నిర్ధారణ అయ్యింది. పటాన్‌చెరు-2, సంగారెడ్డిలో ఇద్దరికి కరోనా సోకింది. సిద్దిపేట జిల్లాలో మొత్తం 120 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా చేర్యాలలో ఇద్దరికి కొవిడ్‌ సోకినట్టు అధికారులు తెలిపారు. 

Read more