రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం

ABN , First Publish Date - 2022-08-10T05:16:09+05:30 IST

కేంద్ర, రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో కాంగ్రె్‌సదే అధికారమని, పేదలను పీడిస్తూ దోచుకుతింటున్న బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సకు అంతిమ గడియలు దగ్గరపడ్డాయని యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
వర్గల్‌లో యూత్‌ కాంగ్రెస్‌ జెండాను ఎగురవేస్తున్న జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి

యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి

ఘనంగా యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వర్గల్‌, ఆగస్టు 9: కేంద్ర, రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో కాంగ్రె్‌సదే అధికారమని, పేదలను పీడిస్తూ దోచుకుతింటున్న బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సకు అంతిమ గడియలు దగ్గరపడ్డాయని యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్గల్‌ మండలంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం జెండాను ఆవిష్కరించారు. అలాగే వర్గల్‌ మండలం మజీద్‌పల్లిలో యూత్‌ కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి, యూత్‌ కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించారు. 

సిద్దిపేట టౌన్‌: అఖిల భారత యువజన కాంగ్రెస్‌ 62వ ఆవిర్భావ దినోత్సవాన్ని సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తాలో మంగళవారం యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ, పీసీసీ కార్యదర్శి గంప మహేందర్‌ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ యూత్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ, క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ సైనికులకు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూజల గోపికృష్ణ, వాహబ్‌, కలిముద్దీన్‌, కనకయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

చేర్యాల: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని యూత్‌ కాంగ్రెస్‌ కొమురవెల్లి మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ 62వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కొమురవెల్లి మల్లన్న ఆలయ ఆవరణలో భక్తులు, ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. 

Updated Date - 2022-08-10T05:16:09+05:30 IST