మోదీది పేరు ఘనం.. ఫలితం శూన్యం: Srinivas reddy
ABN , First Publish Date - 2022-06-27T19:37:47+05:30 IST
దేశ ప్రధాని నరేంద్ర మోదీది పేరు ఘనం.. ఫలితం శూన్యం అని కాంగ్రెస్ నేత, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

సిద్దిపేట: దేశ ప్రధాని నరేంద్ర మోదీది పేరు ఘనం.. ఫలితం శూన్యం అని కాంగ్రెస్(Congress) నేత, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి (Srinivas reddy) అన్నారు. సోమవారం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దుబ్బాకలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్ని ప్రసంగించారు. దేశాన్ని కాపాడే యువకులను అవమానపరిచే విధంగా చేస్తున్న బీజేపీ భారత్ మాతా అనే అర్హత లేదన్నారు. అగ్నిపథ్ పేరుతో దేశాన్ని కాపాడే సైనికులను కేంద్ర ప్రభుత్వం అవమానపరుస్తుందని మండిపడ్డారు. మహాత్మా గాంధీ బాటలో నడుద్దాం... అగ్నిపథ్‌ను బొందపెడుదామని అన్నారు. సైనికునికి విలువ ఇవ్వకుండా దేశాన్ని ఆదాని, అంబానీకి తాకట్టు పెట్టింది మోదీ అని ఆరోపించారు. అగ్నిపథ్ రద్దు అయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులు ధాన్యం అమ్మి నెల గడుస్తున్నా డబ్బులు రాకపోవడం బాధాకరమన్నారు. ఇచ్చిన మాట తప్పని ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.