నారీమణుల పోటాపోటీ
ABN , First Publish Date - 2022-03-06T05:16:07+05:30 IST
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి మహిళా క్రీడా పోటీ లు శనివారం పట్టణంలోని మైత్రీ మైదానంలో ప్రారంభమయ్యాయి.
పటాన్‌చెరులో అట్టహాసంగా ప్రారంభమైన మహిళా దినోత్సవ క్రీడాపోటీలు
పటాన్‌చెరు, మార్చి 5: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి మహిళా క్రీడా పోటీ లు శనివారం పట్టణంలోని మైత్రీ మైదానంలో ప్రారంభమయ్యాయి. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్, ఐఏఎస్ ఆలెప్రియాంక, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు టగ్ ఆఫ్ వార్ పోటీల్లో పటాన్‌చెరు జట్టుకు నేతృత్వం వహించిన ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ, కార్పొరేటర్ పుష్పానగేష్ నేతృత్వం వహించిన జట్టుపై విజయం సాధించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధూఆదర్శరెడ్డి, మెట్టుకుమార్‌యాదవ్, జడ్పీటీసీ సుప్రజ వెంకట్‌రెడ్డి, గంగులసుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్లు రోజాబాల్‌రెడ్డి, లలితాసోమిరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ హారిక విజయ్‌కుమార్, ఎంపీపీలు పాల్గొన్నారు.