ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలి
ABN , First Publish Date - 2022-10-18T05:13:21+05:30 IST
ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం భూములకు పరిహారం చెల్లించి కాలువల నిర్మాణం చేపట్టాలని మండలం గుర్రాలగొంది రైతులు డిమాండ్ చేశారు.
గుర్రాలగొంది రైతుల డిమాండ్
నారాయణరావుపేట, అక్టోబరు 17: ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం భూములకు పరిహారం చెల్లించి కాలువల నిర్మాణం చేపట్టాలని మండలం గుర్రాలగొంది రైతులు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలో, గుర్రాలగొంది గ్రామాల్లో మైనర్ ఇరిగేషన్ కాలువల నిర్మాణం భూసేకరణపై గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం భూములకు ధర కల్పిస్తే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నదని సభదృష్టికి తీసుకొచ్చారు. భూముల మధ్య నుంచి కాలువలు తీయడం వల్ల వ్యవసాయ భూములు ఎటుకాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణరావుపేట మండల కేంద్రంలో మైనర్ ఇరిగేషన్ కాలువల నిర్మాణం మా భూముల్లో నుంచి తీయవద్దని రైతులు తహసీల్దార్ ఉమారాణికి వినతిపత్రం అందజేశారు.