ఎకరానికి రూ.24 లక్షల నష్టపరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2022-03-06T05:11:59+05:30 IST

కాళేశ్వరం పనుల్లో భాగంగా భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఎకరాకు రూ.24 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ చల్మెడలో డిప్యూటి తహసీల్దార్‌ గంగా ప్రసాద్‌కు భూ నిర్వాసిత రైతులు వినతిపత్రం అందజేశారు.

ఎకరానికి రూ.24 లక్షల నష్టపరిహారం చెల్లించాలి
రైతుల అభిప్రాయాలు తీసుకుంటున్న రెవెన్యూ అధికారులు

కాళేశ్వరం భూనిర్వాసితుల డిమాండ్‌

నిజాంపేట, మార్చి 5: కాళేశ్వరం పనుల్లో భాగంగా భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఎకరాకు రూ.24 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ చల్మెడలో డిప్యూటి తహసీల్దార్‌ గంగా ప్రసాద్‌కు భూ నిర్వాసిత రైతులు వినతిపత్రం అందజేశారు. కాగా నిజాంపేట మండలంఓని నస్కల్‌, చల్మెడ గ్రామ శివారులో కాళేశ్వరం కాలువ తవ్వకాల్లో భూమి కోల్పోతున్న భూ నిర్వాసితులతో డిప్యూటి తహసీల్దార్‌ గంగారాం ఆధ్వర్యంలో శనివారం గ్రామ సభ నిర్వహించారు. డివిజనల్‌ అడ్మినిస్ర్టేషన్‌ అధికారి మల్లయ్య హాజరై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధికారులు మాట్లాడుతూ నస్కల్‌లో కాళేశ్వరం కాలువ పనుల్లో భాగంగా 17.13 ఎకరాల భూమి కోల్పోతున్నారని, అధేవిధంగా చల్మెడలో 53.15 ఎకరాల భూమిని కోల్పోతున్నారన్నారు. భూమిని కోల్పోతున్న భూనిర్వాసితులకు ఎకరానికి ఎంత నష్టపరిహారం చెల్లించాలన్నది అధికారులు నిర్ణయిస్తారని సూచించారు. సమావేశంలో ఆర్‌ఐ యూసుఫ్‌, సర్పంచులు నర్సింహారెడ్డి, కవిత, ఎంపీటీసీ బాల్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి చంద్రశేఖర్‌, సర్వేయర్‌ శ్రీనివాస్‌, వీఆర్వోలు స్వామి, సంజీవ్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

Read more