సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఊచలు లెక్కపెట్టక తప్పదు

ABN , First Publish Date - 2022-07-04T05:13:39+05:30 IST

త్యాగాల పునాదులపై ఆవిష్కృతమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి అవినీతికి పాల్పడిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు ఊచలు లెక్కపెట్టక తప్పదని, ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురే్‌షగౌడ్‌ అన్నారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఊచలు లెక్కపెట్టక తప్పదు
చేర్యాల మల్లన ్న ఆలయ ఆవరణ నుంచి ర్యాలీగా తరలివెళ్తున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్‌, నాయకులు,

బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్‌

పలు మండలాల నుంచి విజయ సంకల్ప సభకు తరలివెళ్లిన బీజేపీ నాయకులు 

చేర్యాల, జూలై 7: త్యాగాల పునాదులపై ఆవిష్కృతమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి అవినీతికి పాల్పడిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు ఊచలు లెక్కపెట్టక తప్పదని, ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురే్‌షగౌడ్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రధాని మోదీ విజయ సంకల్ప సభకు చేర్యాల, కొమురవెల్లి, దూల్మిట్ట, మద్దూరు మండలాల నుంచి బూత్‌స్థాయి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లన్న ఆలయం నుంచి చేపట్టిన ర్యాలీని సురేష్‌ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతుగంటి రాందాస్‌, అంకుగారి శశిధర్‌రెడ్డి, కాటం సురేందర్‌, దండ్యాల వెంకట్‌రెడ్డి, తలసాని భాస్కర్‌రెడ్డి, ధరావత్‌ భిక్షపతి, వడ్లకొండ సంజీవులు తదితరులు పాల్గొన్నారు.

దుబ్బాక/మిరుదొడ్డి: సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభకు దుబ్బాక, మిరుదొడ్డి బీజేపీ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న వాహనాలకు ఎమ్మెల్యే రఘునందన్‌రావు జెండా ఊపి తరలించారు. 20 ఏళ్ల తర్వాత సికింద్రాబాద్‌లో 10 లక్షల మందితో నిర్వహించే సభను విజయవంతం చేయడానికి బీజేపీ నాయకులను ప్రత్యేక వాహనాల్లో తరలించినట్టు ఆయన తెలిపారు.  

చిన్నకోడూరు: బీజేపీ విజయ సంకల్ప సభకు బీజేపీ చిన్నకోడూరు మండలాధ్యక్షుడు పిట్ల పరశురాములు ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు నాగరాజు తరలివెళ్లారు. 

దౌల్తాబాద్‌: సికింద్రాబాద్‌లో నిర్వహించే విజయ సంకల్ప సభకు ఆదివారం దౌల్తాబాద్‌ మండలం నుంచి భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. 

జగదేవ్‌పూర్‌: జగదేవ్‌పూర్‌ మండలంలోని మునిగడప, గొల్లపల్లి, పలుగుగడ్డ, తిమ్మాపూర్‌ తదితర గ్రామాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం భారీగా తరలివెళ్లారు. జగదేవ్‌పూర్‌ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి వివిధ వాహనాల్లో 100 మంది బీజేపీ కార్యకర్తలు తరలివెళ్లారు. ఓబీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, బీజేవైఎం మండలాధ్యక్షుడు గుర్రం శ్రీధర్‌, సీనియర్‌ నాయకులు నందాల శ్రీనివాస్‌, కనకయ్య, నాగరాజు యాదవ్‌, శ్రీకాంత్‌గౌడ్‌ ఉన్నారు. 

రాయపోల్‌: విజయ సంకల్ప సభకు రాయపోల్‌ మండలం నుంచి బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు స్వామి, పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్‌గౌడ్‌ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. 

బెజ్జంకి: విజయ సంకల్ప సభకు బీజేపీ బెజ్జంకి మండలాధ్యక్షుడు అశోక్‌ ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు రాజు, రవి, వెంకటేశం, రమాపతిరెడ్డి, రమేష్‌, కార్యకర్తలు తరలివెళ్లారు.

హుస్నాబాద్‌: విజయ సంకల్ప సభకు హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల నుంచి బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున తరలివెళ్లారు. కాగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి విజయపాల్‌రెడ్డి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌బాబు, మండలాధ్యక్షుడు విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లారు. ఇందులో సెన్సార్‌ బోర్డు సభ్యురాలు లక్కిరెడ్డి తిరుమల ఉన్నారు. 

కొండపాక: బీజేపీ విజయ సంకల్ప సభకు కొండపాక మండలం నుంచి బీజేపీ మండలాధ్యక్షుడు  శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కుకునూరుపల్లి నుంచి వాహనాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అలాగే బీజేపీ ఉపాధ్యక్షుడు నలగామ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లారు.

తొగుట: తొగుట మండలం నుంచి 28 వాహనాల్లో బీజేపీ మండలాధ్యక్షుడు చిక్కుడు చంద్రం ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు భారీగా తరలివెళ్లారు. అంతకు ముందు తొగుట మార్కెట్‌యార్డు నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

సిద్దిపేట క్రైం: సిద్దిపేట నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు సిద్దిపేట పట్టణ శివారులోని రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.

Updated Date - 2022-07-04T05:13:39+05:30 IST