రాణే యాజమాన్యానికి తొత్తుగా మారిన సీఐటీయూ

ABN , First Publish Date - 2022-11-27T23:03:20+05:30 IST

గజ్వేల్‌, నవంబరు 27: రాణే యాజమాన్యానికి సీఐటీయూ తొత్తుగా మారిందని బీఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి పీ.శ్రీశైలం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సల్ల శ్రీనివాస్‌ అన్నారు.

రాణే యాజమాన్యానికి తొత్తుగా మారిన సీఐటీయూ

బీఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి పీ.శ్రీశైలం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సల్ల శ్రీనివాస్‌

గజ్వేల్‌, నవంబరు 27: రాణే యాజమాన్యానికి సీఐటీయూ తొత్తుగా మారిందని బీఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి పీ.శ్రీశైలం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సల్ల శ్రీనివాస్‌ అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని బీఎంఎస్‌ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. సీఐటీయూ గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ 2020లో చేసిన వేతన ఒప్పందం సరిగ్గా అమలు చేయలేదన్నారు. కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతున్నదని, సమ్మెల పేరుతో రాజకీయాలు చేస్తూ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. మహాసభల పేరుతో కార్మికుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతూ చందాల దందా చేస్తున్నదని విమర్శించారు. కార్మికుల కోసం బీఎంఎస్‌ పనిచేస్తున్నదని, బీఎంఎ్‌సను విమర్శిస్తే సహించేది లేదన్నారు. వారితో బీఎంఎస్‌ నాయకులు దేవేందర్‌, శ్రీనివాస్‌, పరశురాం, రాములు, శివకుమార్‌, కిష్టయ్య, యాదగిరి, నాగభూషణం, ఇమామోద్దీన్‌, నజీర్‌, కనకయ్య, విజయ్‌కుమార్‌, మల్లయ్య, సురేందర్‌రెడ్డి, రంగయ్య, కిషోర్‌బాబు తదితరులున్నారు.

Updated Date - 2022-11-27T23:03:21+05:30 IST