ఉత్సవాలకు చిన్నకోడూరు పెద్దమ్మ ఆలయం ముస్తాబు

ABN , First Publish Date - 2022-12-01T23:44:23+05:30 IST

చిన్నకోడూరు, డిసెంబరు 1: చిన్నకోడూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం (ఆలయ పున:నిర్మాణం తదుపరి) పంచమ వార్షిక ఉత్సవాలకు ముస్తాబైంది.

ఉత్సవాలకు చిన్నకోడూరు పెద్దమ్మ ఆలయం ముస్తాబు

నేటి నుంచి ఐదురోజుల పాటు ఉత్సవాలు

ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు

చిన్నకోడూరు, డిసెంబరు 1: చిన్నకోడూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం (ఆలయ పున:నిర్మాణం తదుపరి) పంచమ వార్షిక ఉత్సవాలకు ముస్తాబైంది. నేటి (శుక్రవారం) నుంచి ఐదురోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉత్సవాల్లో భాగంగా నేడు అఖండ దీపారాధన, గణపతి పూజ, పుణ్యహవచనం, నవగ్రహరాధాన, భద్రతమండలి, ఋత్విక్‌ కరణ ఆహ్వానం, అభిషేకం, కుంకుమార్చన, హోమం, శనివారం పెద్దమ్మ కల్యాణం, మంగళహారతి, మంత్ర పుష్పం, బ్రాహ్మణులకు సన్మానం, ఆదివారం బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ దేవత పోచమ్మతల్లికి సమర్పించి, పూజలు చేస్తారు. సోమవారం బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి కుల దేవత పెద్దమ్మతల్లికి సమర్పించి, పూజలు చేస్తారు. మంగళవారం గావుపట్టుట తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ముదిరాజ్‌ సంఘం సభ్యులు తెలిపారు.

Updated Date - 2022-12-01T23:44:25+05:30 IST