వారిపై కేసులు ఉపసంహరించుకోవాలి: Jagga Reddy

ABN , First Publish Date - 2022-07-01T23:03:06+05:30 IST

Hyderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అల్లర్ల ఘటనకు ప్రధాని మోదీనే కారణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. నిరుద్యోగులకు ప్రధాని మోదీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు

వారిపై కేసులు ఉపసంహరించుకోవాలి: Jagga Reddy

Hyderabad:  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అల్లర్ల ఘటనకు ప్రధాని మోదీనే కారణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. నిరుద్యోగులకు ప్రధాని మోదీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గతంలో చెప్పారని గుర్తు చేశారు. 


అందుకు కారణం ప్రధాని మోదీనే..

‘‘ కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీం తెచ్చి యువతను నిరాశ పరిచింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాల నుండే ఉద్యమం ప్రారంభమైంది. అగ్నిపథ్‌ స్కీంను వెంటనే వెనక్కు తీసుకోవాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా చెప్పారు. ఆర్మీలో చేరాలని వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్న యువత నిరాశకు గురై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అల్లర్ల ఘటనకు పాల్పడ్డారు. 200 మంది మీద కేసులు పెట్టారు. వారు ఇంకా జైల్లోనే ఉన్నారు. వాళ్ల మీద పెట్టిన కేసులను ఉప సంహరించుకోవాలని బండి సంజయ్, కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. దీనికంతటికి కారణం ప్రధాని మోదీనే.’’ అని జగ్గారెడ్డి అన్నారు.   

ఏమిటీ అగ్నిపథ్ ?

   అగ్నిపథ్ స్కీం కింద ఆర్మీ, నేవి, వైమానిక దళాల్లో నిర్ణీత కాలం పాటు సేవలు అందించడానికి యువతను రిక్రూట్‌మెంట్ చేసుకునే పథకం. ఈ పథకం కింద రిక్రూట్ చేసుకున్న యువతకు శిక్షణ ఇచ్చి త్రివిధ దళాల్లో నాలుగేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగుతారు. ఈ పథకం కింద ఎంపికయిన వారిని అగ్నివీర్స్ అంటారు.

Read more