ఐదెకరాల్లో చెరకు తోట దగ్ధం

ABN , First Publish Date - 2022-01-24T03:44:06+05:30 IST

ప్రమాదవశాత్తు ఐదు ఎకరాల్లో చెరకు తోట దగ్ధమైన సంఘటన జహీరాబాద్‌ మండలంలోని అనేగుంట గ్రామంలో ఆదివారం జరిగింది.

ఐదెకరాల్లో చెరకు తోట దగ్ధం

జహీరాబాద్‌, జనవరి 23: ప్రమాదవశాత్తు ఐదు ఎకరాల్లో చెరకు తోట దగ్ధమైన సంఘటన జహీరాబాద్‌ మండలంలోని అనేగుంట గ్రామంలో ఆదివారం  జరిగింది. గ్రామానికి చెందిన నాగిశెట్టి, అనిల్‌కుమార్‌, బస్వరాజ్‌, సుభా్‌షకు చెందిన ఐదు ఎకరాల చెరుకు తోట కాలి బూడిదైంది. ఆదివారం మధ్యాహ్నం చెరుకు తోట దగ్ధం కావడంవల్ల బాధిత రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. జహీరాబాద్‌లోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లే లోగా అప్పటికే ఐదెకరాల చెరుకుతోటతో పాటు డ్రిప్‌ పరికరాలు, పైపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.ఐదు లక్షల వరకు నష్టం జరిగిందని బాధిత రైతులు పేర్కొన్నారు. 

Read more