పాలకన్న తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం: ఎంపీపీ
ABN , First Publish Date - 2022-08-05T04:59:34+05:30 IST
పుట్టిన బిడ్డకు డబ్బపాల కన్న తల్లిపాలు పట్టించడమే శ్రేయస్కరమని ఎంపీపీ లకావత్ మానస అన్నారు.
కొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలు
హుస్నాబాద్‌రూరల్, ఆగస్టు 4: పుట్టిన బిడ్డకు డబ్బపాల కన్న తల్లిపాలు పట్టించడమే శ్రేయస్కరమని ఎంపీపీ లకావత్ మానస అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మానస మాట్లాడుతూ.. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు పట్టించాలన్నారు. కార్యక్రమంలో సీడీపీవో జయమ్మ, సర్పంచ్ సాయన్న, పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య, అంగన్‌వాడీ టీచర్లు రజిత, స్వరూప, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు
చేర్యాల/దౌల్తాబాద్: చేర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గురువారం ముస్త్యాల గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. తల్లిపాల విశిష్ఠతపై సర్పంచు పెడుతల ఎల్లారెడ్డి, ఎంపీటీసీ కమర్ సుల్తానా అవగాహన కల్పించారు. సీడీపీవో శారద చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన చేశారు. గర్భిణులకు సీమంతం చేశారు. దౌల్తాబాద్ మండలం లింగరాజుపల్లి గ్రామంలో సర్పంచ్ కేత కనకరాజు తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం బాలరాజ్, పంచాయతీ సెక్రెటరీ భరద్వాజ్, అంగన్వాడీ టీచర్ యశోద, ఆశా వర్కర్ లావణ్య పాల్గొన్నారు.