నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేయస్కరం

ABN , First Publish Date - 2022-08-05T05:18:52+05:30 IST

నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేయస్కరమని సీడీసీవో చంద్రకళ అన్నారు.

నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేయస్కరం
కందిలో బాలింతలకు పోషక విలువలపై అవగాహన కల్పిస్తున్న సీడీసీవో చంద్రకళ

సీడీసీవో చంద్రకళ

కంది/అల్లాదుర్గం/నారాయణఖేడ్‌/పాపన్నపేట, ఆగస్టు 4: నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేయస్కరమని సీడీసీవో చంద్రకళ అన్నారు. గురువారం కందిలోని అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో 25 మంది బాలింతలకు పోషక విలువలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు రేణుక, శోభారాణి, సిబ్బంది వీరమణి, లావణ్య, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు  ముర్రుపాలు తాగించాలని ఐసీడీఎస్‌ అల్లాదుర్గం సూపర్‌వైజర్‌ నాగమణి అన్నారు. గురువారం మండల పరిధిలోని గడిపెద్దాపూర్‌లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఇందులో సర్పంచ్‌ అమ్మాయమ్మ, ఎంపీటీసీ విఠల్‌రెడ్డి, వైద్యాధికారిణి డాక్టర్‌ ఫౌజియా పాల్గొన్నారు. నారాయణఖేడ్‌ మండల పరిధిలోని గంగాపూర్‌లో గర్భిణులకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రంమలో అంగన్‌వాడీ టీచర్‌ పార్వతి, తుర్కపల్లి పీహెచ్‌సీ హెల్త్‌ అసిస్టెంట్‌ చంద్రశేఖర్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేట గ్రామంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్లు మంజుల, ఇందిరా పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:18:52+05:30 IST