బీజేపీ జెండా ఎగురవేయాలి : ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌

ABN , First Publish Date - 2022-09-27T05:28:55+05:30 IST

వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయనకు మండలంలోని ఆరూరు గ్రామంలో బీజేపీ నాయకులు నెమలికొండ వేణుమాధవ్‌, శివరాజ్‌పాటిల్‌, కోవూరు సంగమేశ్వర్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

బీజేపీ జెండా ఎగురవేయాలి : ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌

సదాశివపేట రూరల్‌, సెప్టెంబరు 26 :  వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయనకు మండలంలోని ఆరూరు గ్రామంలో బీజేపీ నాయకులు నెమలికొండ వేణుమాధవ్‌, శివరాజ్‌పాటిల్‌, కోవూరు సంగమేశ్వర్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మహత్మా బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ సిద్దాంతాలను ప్రజలకు చేరవేసేందుకు కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రామాగౌడ్‌, సారా కృష్ణ, సత్యనారాయణ, జగన్మోహన్‌రెడ్డి, సంగారెడ్డి లక్ష్మణ్‌, అంజియాదవ్‌, పోల వెంకటేశం, కృష్ణగౌడ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more