దుర్గామాత పూజలో బీజేపీ నాయకులు

ABN , First Publish Date - 2022-10-05T04:51:54+05:30 IST

సంగారెడ్డి సమీపంలోని చింతల్‌పల్లిలో దేవీనవరాత్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ రాజుగౌడ్‌ ప్రత్యేక పూజలు చేశారు.

దుర్గామాత పూజలో బీజేపీ నాయకులు
దుర్గామాత పూజలో పాల్గొన్న దేశ్‌పాండే, డాక్టర్‌ రాజుగౌడ్‌

సంగారెడ్డి అర్బన్‌/ సంగారెడ్డి రూరల్‌, అక్టోబరు 4:  సంగారెడ్డి సమీపంలోని చింతల్‌పల్లిలో దేవీనవరాత్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ రాజుగౌడ్‌ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు హోమంతో పాటు అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ్‌పాండే, డాక్టర్‌ రాజుగౌడ్‌లను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిర్వాహకులు లింగం, సతీశ్‌, అర్వింద్‌ తదితరులు ఉన్నారు.

Read more