హుస్నాబాద్‌లో బీజేపీ గెలవడం ఖాయం

ABN , First Publish Date - 2022-09-30T05:03:16+05:30 IST

హుస్నాబాద్‌ నియోజకవర్గంలో, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని హౌజ్‌ఫెడ్‌ మాజీ రాష్ట్ర చైర్మన్‌, బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి అన్నారు.

హుస్నాబాద్‌లో బీజేపీ గెలవడం ఖాయం
బీజేపీలో చేరినవారికి కండువా కప్పుతున్న బొమ్మ శ్రీరాం చక్రవర్తి

 బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి

కోహెడ, సెప్టెంబరు 29: హుస్నాబాద్‌ నియోజకవర్గంలో, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని హౌజ్‌ఫెడ్‌ మాజీ రాష్ట్ర చైర్మన్‌, బీజేపీ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి అన్నారు. గురువారం మండలంలోని కూరెళ్ల గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు బీజేపీలో చేరగా, వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోహెడ మండలంలో ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ ఆధ్వర్యంలో ఒక్క డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. శనిగరం గ్రామంలో 40 ఇళ్లు మంజూరైనా, నిర్మాణం చేయకపోవడంతో వాటిని వేరే ప్రాంతానికి మంజూరు చేశారని తెలిపారు. ఈ గ్రామానికి తారు రోడ్డు వేస్తానని హామీఇచ్చి ఏళ్లు గడుస్తున్నదని, పనిచేయని ఎమ్మెల్యేలను రానున్న ఎన్నికల్లో ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. గ్రామానికి మొదటిసారిగా వచ్చిన శ్రీరాం చక్రవర్తిని మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఇటీవల మృతిచెందిన పొన్నం చిన్న ఎల్లయ్యగౌడ్‌, చిట్యాల మల్లవ్వ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు వెంకటేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.  

Read more