కులమతాల పేరుతో బీజేపీ చిచ్చు

ABN , First Publish Date - 2022-09-09T05:23:56+05:30 IST

కులమతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురే్‌షషెట్కార్‌, టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి విమర్శించారు.

కులమతాల పేరుతో బీజేపీ చిచ్చు
పెద్దశంకరంపేటలో చేపట్టిన పాదయాత్రలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్‌ షెట్కార్‌, సభ్యుడు సంజీవరెడ్డి, నాయకులు

 టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్‌ షెట్కార్‌, సభ్యుడు సంజీవరెడ్డి 

 రాహుల్‌గాంధీ యాత్రకు సంఘీభావంగా పెద్దశంకరంపేటలో పాదయాత్ర


పెద్దశంకరంపేట, సెప్టెంబరు 8: కులమతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురే్‌షషెట్కార్‌, టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి విమర్శించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు గురువారం రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జూడో యాత్రకు సంఘీభావంగా పెద్దశంకరంపేట మండలంలో పాదయాత్ర చేపట్టారు. కోలపల్లి, లక్ష్మాపూర్‌, బూర్గుపల్లి, బూర్గుపల్లి తండా, మూసాపేట, దానంపల్లి గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎనిమిది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీలేదని ఆరోపించారు. తెలంగాణలో మాయమాటలు చెప్పి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అందరూ కలిసికట్టుగా పోరాడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాలని కోరారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర అక్టోబర్‌లో తెలంగాణలో ప్రవేశిస్తుందని, సంగారెడ్డి, జోగిపేట, పెద్దశంకర్‌పేట మీదుగా సాగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ యువజన సంఘం రాష్ట్ర నాయకులు రాకే్‌షషెట్కార్‌, మండల, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు రాయిని మధు, మధుసూదన్‌, రాజేందర్‌గౌడ్‌, జనార్ధన్‌, జైహింద్‌రెడ్డి, దాచ సంగమేశ్వర్‌, నారాగౌడ్‌, బేతయ్య, సర్పంచులు అంజిరెడ్డి, గడ్డి రాణమ్మ, ఎంపీటీసీ రాజు పాల్గొన్నారు. 


రామాయంపేటలో కాంగ్రెస్‌ పాదయాత్ర 


రామాయంపేట: రామాయంపేటలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ, రామాయంపేట, లింగంగౌడ్‌, మహేందర్‌, స్వామి, సజీరుద్దీన్‌ పాదయాత్ర నిర్వహించారు. 


 

Read more