బైక్‌, లారీ ఢీ: ఒకరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-05-25T05:08:10+05:30 IST

మండలంలోని జగన్నాథ్‌పూర్‌ సమీపంలో మంగళవారం ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్‌ ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

బైక్‌, లారీ ఢీ: ఒకరికి తీవ్ర గాయాలు

నారాయణఖేడ్‌, మే 24: మండలంలోని జగన్నాథ్‌పూర్‌ సమీపంలో మంగళవారం ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్‌ ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... చాంద్‌ఖాన్‌పల్లికి చెందిన గడీల మారుతి బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న బోర్‌ సామగ్రిని తరలించే లారీ ఢీ కొన్నది. దీంతో మారుతికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. 


Updated Date - 2022-05-25T05:08:10+05:30 IST