క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలి
ABN , First Publish Date - 2022-10-18T05:07:31+05:30 IST
ఎంచుకున్న క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందడంతో పాటు ఆ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆరవ జోన్ క్రీడా పోటీలు ప్రారంభం
చేగుంట, అక్టోబరు17: ఎంచుకున్న క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందడంతో పాటు ఆ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. చేగుంట గిరిజన బాలికల క్రీడా పాఠశాలలో ఆరవ జోన్ క్రీడా పోటీలను ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన 14 పాఠశాలల నుంచి 545 మంది విద్యార్థులు 14 విభాగాల్లో పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. నేటి ఓటమి రేపటి గెలుపుగా ముందుకు సాగాలన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌కల్పిస్తూ ప్రభుత్వం వారి అభ్యున్నతికి పాటుపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, ఆర్‌సీవో సంపత్‌కుమార్, ప్రిన్సిపాల్ మమత, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, వివిధ పాఠశాలలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.