సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

ABN , First Publish Date - 2022-10-04T04:57:23+05:30 IST

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు.

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలో బతుకమ్మతల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న యాదవరెడ్డి, వంటేరు

జగదేవ్‌పూర్‌, అక్టోబరు 3: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. సోమవారం మర్కుక్‌ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఎర్రకుంట ఘాట్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మతల్లి విగ్రహాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు. ఇంటిల్లిపాది ఏకమై, ఊరువాడ ఒక్కచోట చేరి ఆనందంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. తొమ్మిది రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాండుగౌడ్‌, జడ్పీటీసీ యెంబరి మంగమ్మ రాంచంద్రంయాదవ్‌, సర్పంచ్‌ భాగ్యభిక్షపతి, ఎంపీటీసీ ధనలక్ష్మీకృష్ణ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ బాలరాజు, ఎంపీడీవో ప్రవీణ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ అఽధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more