సంగారెడ్డి జడ్పీ ఆవరణలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-10-01T04:47:06+05:30 IST

సంగారెడ్డిలోని జిల్లా పరిషత్‌ ఆవరణలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటారు.

సంగారెడ్డి జడ్పీ ఆవరణలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
సంగారెడ్డిలో బతుకమ్మ ఆడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, మంత్రి హరీశ్‌ సతీమణి శ్రీనిత తదితరులు

హాజరైన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌, మంత్రి సతీమణి, ఎమ్మెల్యేల సతీమణులు, ప్రజా ప్రతినిధులు


సంగారెడ్డి టౌన్‌,  సెప్టెంబరు 30 : సంగారెడ్డిలోని జిల్లా పరిషత్‌ ఆవరణలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటారు. జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి, మంత్రి హరీశ్‌రావు సతీమణి శ్రీనిత, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి సతీమణి మంజుల, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ సతీమణి పద్మిణి, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సతీమణి జయశ్రీ, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సతీమణి యాదమ్మ, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, సినీనటి ద్రితి జయంత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌బొంగుల విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ లతావిజయేందర్‌రెడ్డి, ఎస్పీ రమణకుమార్‌ సతీమణి మాధవి, మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  టెస్కో చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్‌, సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమన్నారు. మంత్రి హరీశ్‌రావు సతీమణి శ్రీనిత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి జగమంతా తెలిసేలా ప్రభుత్వం సంబురాలను నిర్వహిస్తుందన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ మాట్లాడుతూ పూలను పూజించే గొప్ప సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కుంచాల ప్రభాకర్‌, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more