కందిలో ముగిసిన ‘ఆయుష్‌ గ్రామ్‌’

ABN , First Publish Date - 2022-03-06T05:12:33+05:30 IST

ఆరోగ్యంపై ప్రతీఒక్కరూ అవగాహన కలి గి ఉండాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో గాయత్రీదేవి అన్నారు.

కందిలో ముగిసిన ‘ఆయుష్‌ గ్రామ్‌’

కంది, మార్చి5: ఆరోగ్యంపై ప్రతీఒక్కరూ అవగాహన కలి గి ఉండాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో గాయత్రీదేవి అన్నారు. కందిలో 3 రోజుల నుంచి జేఎ్‌సపపీఎస్‌ (జయసూర్య పొట్టి శ్రీరాములు) ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ ఆయుష్‌ గ్రామ్‌ మిషన్‌ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో, జడ్పీ సీఈవో ఎల్లయ్య ముగింపు రోజైన శనివారం పరిశీలించారు. కందిలో మొత్తం 400 ఇళ్లకు గ్రామీణ ఆరోగ్య సర్వే జరిపారు. ప్రజలకు వైద్య పరిక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్‌ గ్రామ్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ పార్థసారఽథి, ఆయూష్‌ వైద్యులు, ఎంపీపీ సరళాపుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్‌ రెడ్డి, సర్పంచ్‌ విమలా వీరేశం, ఎంపీడీవో విశ్వప్రసాద్‌, హోమియోపతి వెద్య కళాశాల వైద్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T05:12:33+05:30 IST