రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

ABN , First Publish Date - 2022-10-18T05:17:11+05:30 IST

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఓంకార్‌ రాధాకృష్ణను రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్‌ హన్మంతరావు, సిద్దిపేట కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సోమవారం సన్మానించారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

జగదేవ్‌పూర్‌, అక్టోబరు 17: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఓంకార్‌ రాధాకృష్ణను రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్‌ హన్మంతరావు, సిద్దిపేట కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సోమవారం సన్మానించారు. గ్రామ కంఠం భూములపై ఏర్పాటుచేసిన గ్రామసభలో పాఠశాల అభివృద్ధిపై ప్రశంసించిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఓంకార్‌తో పాటు ఇదే పాఠశాలకు చెందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన రామకృష్ణారెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మరింత కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మీరాములు, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, గడ అధికారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:17:11+05:30 IST