మటన్, చికెన్ దుకాణాలపై దాడులు
ABN , First Publish Date - 2022-10-08T05:11:15+05:30 IST
తూప్రాన్ పట్టణంలోని మటన్, చికెన్ దుకాణాలపై మున్సిపల్ సిబ్బంది శుక్రవారం దాడులు చేసి, తూకం యంత్రాలను లాక్కెళ్లారు.
తూప్రాన్, అక్టోబరు 7: తూప్రాన్ పట్టణంలోని మటన్, చికెన్ దుకాణాలపై మున్సిపల్ సిబ్బంది శుక్రవారం దాడులు చేసి, తూకం యంత్రాలను లాక్కెళ్లారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో మటన్, చికెన్ దుకాణాలకు స్థలాలు కేటాయించారు. అక్కడ అమ్మకాలు సక్రమంగా జరగడం లేదంటూ కొందరు ఇంతకుముందటి ప్రాంతాల్లోనే దుకాణాలను కొనసాగిస్తున్నారు. దీంతో శుక్రవారం మున్సిపల్ సిబ్బంది పోలీసుల సహాయంతో దాడులు చేశారు. దుకాణదారుల వద్ద నున్న తూకం యంత్రాలను ట్రాక్టర్‌లో వేసుకొని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు.