జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులు

ABN , First Publish Date - 2022-09-20T04:54:33+05:30 IST

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మెదక్‌ జిల్లా విద్యార్థిని నీతన్యసిరి, ఖేడ్‌కు చెందిన విద్యార్థి అశ్వంత్‌చారి సత్తా చాటారు.

జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులు

మెదక్‌ అర్బన్‌/నారాయణఖేడ్‌, సెప్టెంబరు19: జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మెదక్‌ జిల్లా విద్యార్థిని నీతన్యసిరి, ఖేడ్‌కు చెందిన విద్యార్థి అశ్వంత్‌చారి సత్తా చాటారు. ఆదివారం హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో వీరిద్దరు బంగారు పతకాన్ని సాధించారు. ప్రముఖ సినీనటుడు సుమన్‌ పతకంతో పాటు విద్యార్థులకు సర్టిఫికెట్‌ను అందజేశారు.

Read more