జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2022-03-06T04:55:36+05:30 IST

ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేశామని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
మాట్లాడుతున్న పాపిరెడ్డి

సంగారెడ్డి క్రైం, మార్చి 5: ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేశామని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోర్టులోని తన ఛాంబర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... న్యాయవాదులు, ప్రజలు, కక్షిదారులు, పోలీసులు, ఇన్సూరెన్స్‌ అధికారులు, బ్యాంకు అధికారులు, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులంతా లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీ మార్గంలో కేసులను ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకొని సత్వర న్యాయం పొందాలని కోరారు.  సమావేశంలో 7వ అదనపు జిల్లా జడ్జి ఎ.కర్ణకుమార్‌, 5వ అదనపు జిల్లా జడ్జి పి.రాజు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌.ఆశాలత, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ జలీల్‌, స్పెషల్‌ మొబైల్‌ కోర్టు జడ్జి జె.హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-03-06T04:55:36+05:30 IST