కుంటలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-03-06T04:56:28+05:30 IST

పట్టణ పరిధిలోని కుమ్మరికుంటలో శనివారం ఉదయం గుర్తు తెలియని 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

కుంటలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

నర్సాపూర్‌, మార్చి 5: పట్టణ పరిధిలోని కుమ్మరికుంటలో శనివారం ఉదయం గుర్తు తెలియని 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్‌ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌-తూప్రాన్‌ ప్రఽధానరోడ్డు పక్కన పట్టణ సమీపంలో ఉన్న కుమ్మరికుంటలో ఓ మృతదేహం ఉన్నట్టు కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు వెళ్లి పరిశీలించగా రెండు రోజుల క్రితమే మరణించినట్టు భావిస్తున్నారు. మృతదేహంపై ఎరుపు చొక్కా, బ్లూ నైట్‌ప్యాంట్‌ ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. 

Read more