బొమ్మన్‌కుంటలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2022-08-17T05:14:29+05:30 IST

పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని బొమ్మన్‌కుంట గ్రామంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.

బొమ్మన్‌కుంటలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

పటాన్‌చెరు/సంగారెడ్డి రూరల్‌, ఆగస్టు 16: పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని బొమ్మన్‌కుంట గ్రామంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.  ఈ ఘటనపై గ్రామస్థులు, దళితసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ గంగుల సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ దేవదానం, సహదేవ్‌, షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కార్యదర్శి రుద్రారంశంకర్‌, పలు సంఘాల నాయకులు  విగ్రహాన్ని సందర్శించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ యువసేన జిల్లా కన్వీనర్‌ శివరామకృష్ణ, అంబేడ్కర్‌ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దొబ్బల రవీందర్‌ డిమాండ్‌ చేశారు.  

Read more