ఎన్సాన్‌పల్లి గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-07-19T05:21:04+05:30 IST

సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి బాలికల రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలను సోమవారం సాయంత్రం అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ ఆకస్మిక తనిఖీ చేశారు.

ఎన్సాన్‌పల్లి గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

సిద్దిపేట అర్బన్‌, జూలై 18: సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి బాలికల రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలను సోమవారం సాయంత్రం అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో భోజనం బాగానే ఉన్నదని, నీటి సమస్య, ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్‌, ఆట వస్తువులు కావాలని విద్యార్థులు అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వారంరోజుల్లో నీటి సమస్య లేకుండా చూస్తామని, ఆట వస్తువులు కూడా అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌ రవీందర్‌గౌడ్‌, ఓఎస్డీ బాల్‌రాజ్‌, ఎంపీటీసీ ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more