నర్సాపూర్‌లో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష
ABN , First Publish Date - 2022-12-16T00:00:33+05:30 IST
పట్టణంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన ప్రత్యేక నిధులు రూ.25కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం పరిశీలించారు.
నర్సాపూర్, డిసెంబరు 15: పట్టణంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన ప్రత్యేక నిధులు రూ.25కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ భవనం, సమీకృత మార్కెట్, డంప్‌యార్డు, శ్మశానవాటిక, గ్రంథాలయ భవన నిర్మాణాల్లో జాప్యంపై కారణాలను తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆమెవెంట కమిషనర్ వెంకట్‌గోపాల్, అధికారులు ఉన్నారు.