లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మితే చర్యలు: ఏవో
ABN , First Publish Date - 2022-10-08T04:35:13+05:30 IST
లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తొగుట మండల వ్యవసాయ అధికారి మోహన్ హెచ్చరించారు.
తొగుట, అక్టోబరు7 : లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తొగుట మండల వ్యవసాయ అధికారి మోహన్ హెచ్చరించారు. శుక్రవారం వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్ సీఐ దిలీ్‌పకుమార్ తనిఖీలు చేశారు. తొగుట మండలం గుడికందులలో లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. గ్రామానికి చెందిన గోరిట ఇంద్రారెడ్డి నివాసంలో 2.15 క్వింటాళ్ల బీర్నీస్ విత్తనాలు అమ్మడానికి సిద్ధంగా ఉంచినట్లు గుర్తించి, సీజ్ చేశారు. మిరుదొడ్డి పోలీ్‌సస్టేషన్‌కు తరలించి, విత్తన చట్ట ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.