ఓటర్ కార్డుకు ఆధార్ సీడింగ్ చేయాలి: ఆర్డీవో
ABN , First Publish Date - 2022-08-05T04:58:47+05:30 IST
బోగస్ ఓటరుకార్డుల ఏరివేతలో భాగంగా ఓటర్ కార్డుకు ఆధార్ ఆనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు.
చేర్యాల, ఆగస్టు 4: బోగస్ ఓటరుకార్డుల ఏరివేతలో భాగంగా ఓటర్ కార్డుకు ఆధార్ ఆనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేయాలని హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు. చేర్యాల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూల్మిట్ట మండలాల బీఎల్‌వోలతో శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆధార్‌సీడింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ బీఎల్‌వో గరుడ యాప్‌లో వివరాలు పొందుపరచాలన్నారు. అలాగే సాధారణ ప్రజలు ఫారం నెం6-బి వ్యక్తిగతంగానైనా తహసీల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సీడింగ్ ప్రక్రియపట్ల నిర్లక్ష్యం వహించకూడదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు ఆరీఫా బేగం, లక్ష్మీనారాయణ, అశోక్, నరేందర్ పాల్గొన్నారు.