చెరువులో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-09-20T04:30:41+05:30 IST

దుబ్బాక మండలం గంబీర్‌పూర్‌ గ్రామంలో నాలుగురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు సోమవారం స్థానిక చెరువులో శవమై తేలాడు.

చెరువులో పడి యువకుడి మృతి

దుబ్బాక, సెప్టెంబరు 19: దుబ్బాక మండలం గంబీర్‌పూర్‌ గ్రామంలో నాలుగురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు సోమవారం స్థానిక చెరువులో శవమై తేలాడు. గ్రామానికి చెందిన దోర్నాల బాల్‌రాజ్‌కు ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు శ్రీకాంత్‌(23) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే 16న ఇంటినుంచి బయటకు వెళ్లిన శ్రీకాంత్‌ కనిపించకుండా పోయాడు. సోమవారం స్థానిక చెరువు వద్ద చూసేసరికి శవమై తేలాడు. బైక్‌ మీద కట్టపై వెళ్లిన శ్రీకాంత్‌ ప్రమాదవశాత్తు జారి చెరువులో పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు. 

Read more