నీటి కుంటలో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-16T06:03:44+05:30 IST

నీటి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బోర్పట్ల గ్రామ శివారులో సోమవారం జరిగింది.

నీటి కుంటలో పడి వ్యక్తి మృతి

హత్నూర, ఆగస్టు 15: నీటి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన  మండలంలోని బోర్పట్ల గ్రామ శివారులో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల రవి(35) భార్య యశోదతో కలిసి శనివారం బోర్పట్ల గ్రామంలో ఉన్న బామ్మర్దికి రాఖీ కట్టేందుకు వచ్చారు. రాఖీ కట్టిన అనంతరం మద్యం తాగి భార్య యశోదతో గొడవ పడిన రవి అదేరోజు రాత్రి రుద్రారం వెళ్తున్నానని చెప్పి వెళ్లి కనిపించకుండా పోయాడు. కుటుంబీకులు రెండు రోజులుగా గాలించినా ఫలితం లేకపోయింది. కాగా సోమవారం బోర్పట్ల గ్రామ శివారులోని పట్లోళ్లకుంట నీటి గుంతలో రవి శవమై కనిపించినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ దుర్గయ్య తెలిపారు.  

Read more