చెరువులో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-10-07T06:03:20+05:30 IST
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పోతులబొగుడలో బుధవారం జరిగింది.
వట్‌పల్లి, అక్టోబరు 6: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పోతులబొగుడలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ అంబ్ర్యానాయక్ వివరాల ప్రకారం.. పోతులబొగుడ గ్రామానికి చెందిన చింతల మచ్చెందర్ (35) అనే వ్యక్తి బుధవారం స్నానం చేసి వస్తానని కుటుంబీకులకు చెప్పి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోయింది. గ్రామసమీపంలోని ఓ చెరువు గట్టుపై అతడి చెప్పులను గుర్తించిన కుటుంబీకులు ఆ చెరువులో గాలించారు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య విజయమేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.