ఇటుక బట్టీలను సందర్శించిన జడ్జి

ABN , First Publish Date - 2022-12-15T00:14:44+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు’ అనే శీర్షికన ఈ నెల 12న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి నర్సాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి అనిత స్పందించారు.

ఇటుక బట్టీలను సందర్శించిన జడ్జి
రూప్లాతండాలో వివరాలు తెలుసుకుంటున్న జడ్జి అనిత

శివ్వంపేట, డిసెంబరు 14: ‘నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు’ అనే శీర్షికన ఈ నెల 12న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి నర్సాపూర్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి అనిత స్పందించారు. బుధవారం మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆమె ఇటుక బట్టీలను సందర్శించారు. శివ్వంపేట మండల పరిధిలోని కొత్తపేట రూప్లాతండా వద్ద ఇటుకబట్టీల్లో పని చేసే ఇతర రాష్ట్రాల కూలీలకు సరైన వేతనం ఇవ్వకుండా, సౌకర్యాలను కల్పించకుండా, బాల కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్న విషయాలపై ఇటుక బట్టీల నిర్వాహకులను విచారించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.

కూలీలను ఇబ్బందులకు గురి చేస్తున్న నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జడ్జి అనిత తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా జడ్జి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

Updated Date - 2022-12-15T00:29:59+05:30 IST