ఘనంగా బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-09-30T05:03:55+05:30 IST

ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీపీ.రాజు వేడుకలను ప్రారంభించి మాట్లాడారు.

ఘనంగా బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న విద్యార్థులు

సిద్దిపేట అర్బన్‌/హుస్నాబాద్‌, సెప్టెంబరు 29: ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీపీ.రాజు వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. ఇందూర్‌లో ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉన్నదన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మలను తయారు చేసి, కోలాటం ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ యాదయ్య, పీఆర్వో రఘు, సిబ్బంది డీపీ.రావు, డాక్టర్‌ మల్లేశం, పోచయ్య, ఎల్‌ఎన్‌.రావు, ఎస్‌.శ్రీనివాస్‌, పాండురంగం, సరస్వతి, టీ.బెనర్జీ, భవాని పాల్గొన్నారు. హుస్నాబాద్‌ పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో గురువారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో అందంగా బతుకమ్మ పేర్చి ఆటపాటలతో సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సెంట్రల్‌ సెన్సార్‌ బోర్డు సభ్యురాలు లక్కిరెడ్డి తిరుమల, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుధా, రాంగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more