కారులో చెలరేగిన మంటలు

ABN , First Publish Date - 2022-10-04T05:16:07+05:30 IST

మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ శివారులో సోమవారం హైవే రోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది.

కారులో చెలరేగిన మంటలు
దగ్ధమవుతున్న కారు

తూప్రాన్‌ (మనోహరాబాద్‌), అక్టోబరు 3: మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ శివారులో సోమవారం హైవే రోడ్డుపై  ఓ కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులు కారులో కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. కాళ్లకల్‌ శివారులోకి హైవే 44 మీదుగా విచ్చేస్తుండగా, కారులో నుంచి పొగలు వచ్చాయి. కారును ఆపి పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు ఇంజన్‌ కాలిపోయింది. అదృష్టవశాత్తు  కారులో ప్రయాణిస్తున్న నలుగురు  ప్రమాదం నుంచి  బయటపడగలిగారు.

Read more