శిథిలావస్థలో కానుకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

ABN , First Publish Date - 2022-08-05T05:20:33+05:30 IST

గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది.

శిథిలావస్థలో కానుకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

గుమ్మడిదల, ఆగస్టు 4: గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పాఠశాలలో 200 మంది పిల్లలు చదువు సాగిస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్నది. కానీ శిథిలావస్థలో ఉన్న కానుకుంట ప్రాథమిక పాఠశాలను మాత్రం ‘మనఊరు-మనబడి’కి ఎంపిక చేయకపోవడం పట్ల పాలకులపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం పాఠశాల మరమ్మతు కోసం నిధులు మంజూరుకావడంతో గ్రామానికి చెందిన ఎంపీపీ ఉపాధ్యక్షుడు మంజులావెంకటే్‌షగౌడ్‌ కాంట్రాక్టు తీసుకుని పాత గోడలపైనే రేకుల షెడ్డు వేసి వదిలేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శిథిలావస్థలో ఉన్న పాఠశాలకు మరమ్మతు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2022-08-05T05:20:33+05:30 IST