వ్యక్తిపై హత్యాయత్నం కేసు

ABN , First Publish Date - 2022-10-02T05:28:05+05:30 IST

బైక్‌ను లారీతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యక్తిపై హత్యాయత్నం కేసు
పెద్దశంకరంపేట లారీ ఢీకొట్టడంతో ధ్వంసమైన బైకు

పెద్దశంకరంపేట, అక్టోబరు 1: బైక్‌ను లారీతో ఢీకొట్టి హత్యాయత్నానికి  పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఎస్‌ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బద్దారం సర్పంచు నాగమణి భర్త విఠల్‌గౌడ్‌ శుక్రవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన జయంత్‌ అనే యువకుడితో కలిసి బైక్‌పై పెద్దశంకరంపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గాజుల రవీందర్‌ లారీతో వెంబడించి పెద్దశంకరంపేట శివారులోని 133 కేవీ ఉప కేంద్రంవద్ద బైక్‌ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో విఠల్‌గౌడ్‌, జయంత్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. పాత కక్షలతో తమను లారీతో ఢీ కొట్టి హత్య చేసేందుకు రవీందర్‌ యత్నించాడని విఠల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రవీందర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు. 

Read more