గజ్వేల్‌ నియోజకవర్గంలో సీసీ రోడ్లకు రూ.9.90 కోట్లు

ABN , First Publish Date - 2022-01-24T05:11:43+05:30 IST

గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో సీసీరోడ్ల అభివృద్ధికి రూ.9కోట్ల 90లక్షలు మంజూరైనట్లు ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడి వెల్లడించారు.

గజ్వేల్‌ నియోజకవర్గంలో  సీసీ రోడ్లకు రూ.9.90 కోట్లు
ఎల్లాగౌడ్‌ కుటుంబసభ్యులకు బీమా చెక్కును అందజేస్తున్న ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి

ఎ్‌ఫడీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి

 గజ్వేల్‌, జనవరి 23: గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో సీసీరోడ్ల అభివృద్ధికి రూ.9కోట్ల 90లక్షలు మంజూరైనట్లు  ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడి వెల్లడించారు. గజ్వేల్‌ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుల ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని గజ్వేల్‌, కొండపాక, వర్గల్‌ మండలాలకు రూ. ఒక కోటి 80లక్షలు, జగదేవ్‌పూర్‌ మండలానికి రూ. ఒక కోటి 55లక్షలు, మర్కుక్‌ మండలానికి రూ. ఒక కోటి 25లక్షలు, ములుగు మండలానికి రూ. ఒక కోటి 70లక్షలు మంజూరైనట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యాన్ని పెంపొందించేందుకు కృషిచేస్తున్నదన్నారు. 


కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎల్లాగౌడ్‌ గత ఏడాది ప్రమాదవశాత్తు మృతి చెందగా,  రూ.2లక్షల ప్రమాదబీమా చెక్కును ఆయన భార్య ప్రేమలతకు అందజేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్లాగౌడ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని, పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు తప్పకుండా దక్కుతుందన్నారు. 2021–23 సంవత్సరానికి గానూ గజ్వేల్‌ నియోజకవర్గంలో 97వేల మంది సభ్యత్వాలు తీసుకున్నారని వెల్లడించారు. 17మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆయా కారణాలతో మృతిచెందితే ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున రూ.34లక్షల చెక్కులు వచ్చాయన్నారు. వారి వెంట మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు అన్నపూర్ణ, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, కౌన్సిలర్‌ ఉప్పల మెట్టయ్య, రహీం, నాయకులు తదితరులున్నారు.  

Updated Date - 2022-01-24T05:11:43+05:30 IST