నియోజకవర్గ అభివృద్ధికి 72.97 కోట్లు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-12-31T23:09:02+05:30 IST

పటాన్‌చెరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, మనఊరు-మనబడి, తాగునీటి వసతుల కల్పన కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ఇటీవల 72.97 కోట్ల నిధులను మంజూరు చేశారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధికి 72.97 కోట్లు: ఎమ్మెల్యే
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే గూడెంమహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, డిసెంబరు 31: పటాన్‌చెరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, మనఊరు-మనబడి, తాగునీటి వసతుల కల్పన కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ఇటీవల 72.97 కోట్ల నిధులను మంజూరు చేశారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం పటాన్‌చెరులో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న తీరు, నిధులమంజూరు వివరాలను వెల్లడించారు. కేజీ టూ పీజీ క్యాంపస్‌ను, స్టేడియాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇస్నాపూర్‌ వరకు మెట్రో సేవలను విస్తరించాలని కోరతామన్నారు. అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల మాదిరిగా పరిగెత్తిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా 36 మందికి రూ. 17లక్షల సీఎం సహయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

Updated Date - 2022-12-31T23:09:02+05:30 IST

Read more