అజాగ్రత్తగా బైక్‌ నడిపిన వ్యక్తికి 6 నెలల జైలు

ABN , First Publish Date - 2022-10-08T04:37:02+05:30 IST

సిద్దిపేటలోని ఇందిరానగర్‌కు చెందిన అభిలాష్‌ 2019 ఫిబ్రవరి 2న తన బైక్‌పై, స్నేహితుడు అరుణ్‌ను ఎక్కించుకొని అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి ఎన్సాన్‌పల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద ప్రమాదం చేశాడు.

అజాగ్రత్తగా బైక్‌ నడిపిన వ్యక్తికి 6 నెలల జైలు

సిద్దిపేట క్రైం, అక్టోబరు 7: సిద్దిపేటలోని ఇందిరానగర్‌కు చెందిన అభిలాష్‌ 2019 ఫిబ్రవరి 2న తన బైక్‌పై, స్నేహితుడు అరుణ్‌ను ఎక్కించుకొని అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి ఎన్సాన్‌పల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద ప్రమాదం చేశాడు. దీంతో అరుణ్‌ తలకు బలమైన గాయం కాగా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అరుణ్‌ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి వన్‌టౌన్‌ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి కేసు నమోదు చేసి, నేరస్థుడుని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపించారు. విచారణ అనంతరం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్దిపేట ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో కేసు విచారణ జరిగింది. మెజిస్ట్రేట్‌ సల్మా ఫాతిమా ఇరువురి వాదనలను విన్న తర్వాత  శుక్రవారం నేరస్థుడిపై నేరం రుజువైనందున ఆరు నెలల జైలు, రూ.వెయ్యి జరిమానా విధించారు. నేరస్థుడికి శిక్ష పడడానికి అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రూప తన వాదనలు వినిపించారు. 

Updated Date - 2022-10-08T04:37:02+05:30 IST