సిద్దిపేట కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’కి 36 ఫిర్యాదులు
ABN , First Publish Date - 2022-11-15T00:26:02+05:30 IST
జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భూ సంబంధిత, రెండు పడక గదుల ఇళ్లు, ఆసరా పింఛన్లు, ఇతరత్రా కలిపి 36 ఫిర్యాదులు వచ్చాయి.
అర్జీలను స్వీకరించిన అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
సిద్దిపేట అగ్రికల్చర్, నవంబరు 14 : జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భూ సంబంధిత, రెండు పడక గదుల ఇళ్లు, ఆసరా పింఛన్లు, ఇతరత్రా కలిపి 36 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్ శ్రీనివా్‌సరెడ్డి అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరింపజేసి అర్జిదారులకు న్యాయం చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. పరిష్కరించిన అర్జీల నివేదికను వారం లోపు అందజేయాలని ఆయన ఆదేశించారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా సమయానికి రావాలని, అనుమతి లేనిదే గైర్హాజరు కావద్దని ఆయన ఆదేశించారు.