అధ్వానంగా రహదారి

ABN , First Publish Date - 2022-01-21T05:20:02+05:30 IST

మక్తల్‌ నుంచి అనుగొండకు వెళ్లే రహదారి మరమ్మతులకు నోచు కోకపోవడంతో గుంతలుగా ఏర్పడి అధ్వానంగా తయారైంది.

అధ్వానంగా రహదారి
కర్ని గ్రామ సమీపంలో గుంతలు పడిన బీటీ రోడ్డు

- చోద్యం చూస్తున్న అధికారులు 

- వరుస ప్రమాదాల్లో పలువురి దుర్మరణం  

- అనుగొండ వరకు డబుల్‌ రోడ్డును విస్తరించాలి

మక్తల్‌ రూరల్‌, జనవరి 20 : మక్తల్‌ నుంచి అనుగొండకు వెళ్లే రహదారి మరమ్మతులకు నోచు కోకపోవడంతో గుంతలుగా ఏర్పడి అధ్వానంగా తయారైంది. దాదాపు పదేళ్ల క్రితం పుష్కరాల సమయంలో పసుపుల వరకు అప్పటి ప్రభుత్వం రహదారి మరమ్మతులో భాగంగా రెండు కోట్ల నిధులు కేటాయించినా అధికారులు పూర్తిస్థాయి లో మరమ్మతు చేయకుండా కేవలం గుంతలను పూడ్చి మమ అనిపించారు. దీంతో పలు చోట్ల రహదారి గుంతలు పడటంతో రాత్రి వేళ వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నీ, చిట్యాల, కానాపూర్‌ సమీపంలో పలు బైక్‌ ప్రమాదాలలో సుమారు పది మందికి పైగా మృత్యువాత పడినా ప్రభుత్వంలో కదిలిక రావడం లేదు. ఇక ఇదే రహదారిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లు మితిమిరిన వేగంతో పాటు ఎక్కువ లోడుతో వెళ్తుండటంతో రహదారులు మరింత దారుణంగా తయార య్యాయి. ఈ రహదారి గుండా సుమారు 15 గ్రా మాలకు పైగా ప్రజలకు మక్తల్‌తో సంబంధాలు ఉండడంతో వెంటనే గుంతలను పూడ్చడంతో పాటు మక్తల్‌ నుంచి అనుగొండ వరకు డబుల్‌ రోడ్డును విస్తరించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2022-01-21T05:20:02+05:30 IST