తెగులు దిగులు

ABN , First Publish Date - 2022-12-13T22:55:50+05:30 IST

మిరప తోటలో తెగుళ్లు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎర్రనల్లి, శనగపచ్చ, లద్దె పురుగు తెగుళ్లకు ఇప్పుడు తామర పురుగులు తోడయ్యాయి.

తెగులు దిగులు
మానవపాడు మండలంలో మిర్చి తోట

మిరప పంటను ఆశిస్తున్న తామర పురుగుతో రైతులకు నష్టం

అడ్డగోలుగా మందులు పిచికారి చేస్తుండటం వల్ల ఖర్చు అధికం

మారిన వాతావరణ పరిస్థితులు కూడా పంట నష్టానికి కారణం

మిరప తోటలో తెగుళ్లు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎర్రనల్లి, శనగపచ్చ, లద్దె పురుగు తెగుళ్లకు ఇప్పుడు తామర పురుగులు తోడయ్యాయి. ఈ తామర పురుగులు ఆకు, పూత, కాయపై వాలి రసం పీల్చుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాటి నివారణకు అవగాహన లోపంతో పురుగుల మందులను ఎక్కువగా పిచికారి చేస్తున్నారు. ఆ మందులకు అలవాటైన తామర పురుగు పంటకు మరింతగా నష్టం చేకూరుస్తోంది. అధిక మందుల వల్ల మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతోంది. తెగుళ్ల నివారణకు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారుల నుంచి సూచనలు, మార్గదర్శకాలు లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.

- ఆంధ్రజ్యోతి, గద్వాల

జోగుళాంబ గద్వాల జిల్లాలో మిరప రైతులు తెగుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో ఉద్యానశాఖ పరి ధిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే మొదటి పంట మిర్చీనే. అన్ని పంటల పరంగా చూస్తే విస్తీర్ణంలో మూడో ప్రధాన పంటగా మిరపను సాగు చేస్తున్నారు. ప్రధానంగా అలంపూర్‌ నియో జకవర్గంలోని అన్ని మండ లాలతో పాటు గద్వాల నియోజకవర్గంలోని గద్వాల, మల్దకల్‌, గట్టు మండలాల్లో ఈ ఏడాది 36,757 ఎకరాల్లో మిరప నాటారు. అందులో సింహభాగం అలంపూర్‌ నియోజకవర్గంలోనే సాగవుతుంది. ప్రస్తుతం తుమ్మిళ్ల వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందుతున్న ఈ నియోజకవర్గంలో రైతులు గతేడాది నుంచి మిరప సాగును పెంచారు. కానీ దిగుబడులు ఆశించినంతగా రావడం లేదు. అందుకు ప్రధాన కారణం తోటను తామర పురుగు ఆశించడం. దీంతోపాటు ఎర్రనల్లి, శనగపచ్చ పురుగు, లద్దె పురుగు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోంది. ఎక్కువగా ఆశిస్తున్న చీడపీడల వల్ల దిగుబడులు తగ్గడంతో పాటు పంట వచ్చే కాలం కూడా తగ్గిపోతోందనే ఆందోళన రైతుల్లో ఉంది.

ఎకరాకు లక్ష పెట్టుబడి..

మిర్చి రేటుకు తగ్గట్లుగానే శ్రమ, పెట్టుబడి కూడా భారీగానే ఉంటుంది. నారు పెంచడం దగ్గర నుంచి పంట చేతికి వచ్చి విక్రయించే వరకు ఎకరాకు దాదాపు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. రేటు సరిగా ఉంటే రైతు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ప్రధానంగా పెట్టు బడి విషయంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. అం దుకు క్రిమిసంహారక మందులే కారణమని చె ప్పొచ్చు. సాధారణంగా తోట పూర్తయ్యే వరకు నాలుగుసార్లు డీఏపీ, యూరియా, పోటాషి యం తదితర అడుగు మందులు వాడతారు. అలాగే వారం నుంచి పది రోజులకోసారి క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తారు. క్రిమిసంహారక మందులు ఎక్కు వగా వాడటం వల్ల మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోయి, పురుగులే ఎక్కువగా విజృంభిస్తున్నాయి. అలాగే తొందరగా ఎదుగుదల కోసం బయో మందులు వాడుతుం డటం వల్ల కూడా ఎక్కడ లేని చీడపీడలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న తామర పురు గులకు కూడా క్రిమిసంహారక మందుల దుకాణదారులు ఏవేవో మందులు రైతులకు అంటగడుతున్నారు. దీనివల్ల అటు పురుగు చావకపోగా.. రైతుకు పెట్టుబడి తడిసిమోపెడవుతోంది. ఈ ఏడాది పెట్టుబడి రూ.లక్ష కంటే మరో రూ.20వేలు అదనంగా పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ప్రధానంగా మిరపలో ఆశించే తెగుళ్లు, పురుగులు, వైర స్‌ తదితర రోగాల పట్ల స్థానిక వ్యవ సాయ, ఉద్యానశా ఖ అధికారులకు అవ గాహన లేకపోవడం, ఉన్నా వారు రైతులకు అవగాహన కల్పించకపో వడం వల్ల ఫెస్టిసైడ్స్‌ కంపె నీలు చెప్పిన మందులనే రైతులు వాడుతున్నారు. మిర్చి సాగు చేస్తున్న రైతుల తోటల వద్దకు వెళ్లి సరైన అవగా హన కల్పిస్తేనే నష్టాన్ని నివారించే అవకాశం ఉంది.

వాతావరణంతోనే సమస్య..

ఈ ఏడాది జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసింది. నవంబరు వరకు జిల్లాలో వర్షాలు కురిశాయి. వర్షం ఎక్కువగా కురవడం వల్ల కూడా చీడపీఢలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఎక్కువగా మబ్బులు ఉండటం వల్ల సుర్యరశ్మి సరిగా పడకపోవడంతో పంట నష్టం అధికమవుతోంది. గతంలో ఎర్రనల్లి, శనగపచ్చ పురుగు, లద్దె పురుగులు ఎక్కువగా మిరప పంటను ఆశించేవి. అయితే గతేడాది నుంచి తామర పురుగు కూడా ఆశించడం, దాన్ని ఎదుర్కొనే చర్యలు రైతులకు తెలియకపోవడం వల్ల మార్కెట్‌లో దొరికిన పురుగుల మందులను ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల కూడా రైతులకు పెట్టుబడి భారం పెరుగుతుంది. జిల్లాలో ఉద్యానశాఖ అధికారులు ఎక్కువగా లేకపోవడంతో రైతులకు అవగాహన కల్పించడం కష్టమవుతోంది. రైతులకు అవగాహన ఉంటే ముందస్తు చర్యలు తీసుకోడానికి వీలుంటుంది. కానీ అవగాహన లోపం వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తామర పురుగు ఏం చేస్తుంది?

తామర పురు గులు మిల్లీ మీటరు కన్నా తక్కువ పొడవు ఉండి, నలుపు రంగులో సన్నగా, పొడవుగా ఉంటాయి. ఆడ పురుగులు నలుపు రంగులో మగ పురుగుల కంటే పొడవుగా ఉంటాయి. మగ పురుగులు పసుపు రంగులో చిన్నగా ఉంటాయి. ఈ పురుగుల జీవిత కాలం 15 నుంచి 20 రోజులు. తల్లి పురుగులు 150 గుడ్ల వరకు పెడతాయి. ప్రస్తుతం వస్తున్న తామర పురుగులు ఆకుల నుంచి రసం పీల్చిన ప్పుడు ముక్కుతో లోతుగా గుచ్చటం వల్ల ఆకుల ఆకారం దెబ్బతింటుంది. ఇవి టొబాకో స్టిక్‌ వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తాయి. ఇవి ఆశించిన సమయంలో రైతులు ఎక్కువగా పురుగు మందులు వాడటం వల్ల వాటి సహజ శత్రువులు చనిపోయి, పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

నివారణ ఇలా..

తామర పురుగుల నివారణ కోసం అయితే పొలంలో ఎకరానికి 50 చొప్పున నీలిరంగు జిగురు బుట్టలు అమర్చుకోవాలి. వేప నూనె 10000 పీపీఎం మూడు మిల్లీ లీటర్లు లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనివల్ల తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నియంత్రించవచ్చు. దీంతోపాటు సర్ఫ్‌ లేదా స్టిక్కర్‌ 0.5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రైతులు సింథటిక్‌ పైరిథ్రాయిడ్స్‌, ఇతర రసాయనిక మందులు తరచుగా పిచికారీ చేయొద్దు.

కాయకుళ్లు తెగులుతో ఇబ్బంది

నేను రెండెకరాల్లో మిరప పంట సాగు చేశా. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేశాను. తోట పండు పట్టే దశకు చేరుకుంది. వర్షాల కారణంగా కాయకుళ్లు తెగులు వచ్చి, పంట దెబ్బతింటోంది. పెట్టుబడి భారం ఎక్కువ అయ్యింది. పెట్టుబడి వరకైనా దిగుబడి వస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తామర పురుగు, ఆకుముడత తెగులు సమస్య కూడా ఏటికేడు పెరుగుతోంది.

- ఖాజా హుస్సేన్‌ రైతు, అమరవాయి, మనవపాడు మండలం

తామర పురుగు ఆశిస్తోంది

సొంతంగా నాకు సెంటు పొలం లేదు. రూ.20 వేల చొప్పున మూడెకరాలు కౌలుకు తీసుకున్నాను. బేడియా మిరప రకం సాగు చేశాను. మొన్నటి దాక తామర పురుగు సోకి, ఆకుముడత తెగులు ఆశించడంతో పురుగు మందులు పిచికారీ చేశాం. ఇప్పటికే ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చు వచ్చింది. అంతలోనే మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కాయకు మచ్చ తెగులు సోకే ప్రమాదం ఉంది. దీని వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది.

- మద్దిలేటి, రైతు, చెన్నిపపాడు, మానవపాడు మండలం

Updated Date - 2022-12-13T22:55:51+05:30 IST