మత్స్యకారుల అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2022-12-07T22:51:17+05:30 IST
మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్ రూరల్, డిసెంబరు 7 : మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్‌లో ఎమ్మెల్యే రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100 శాతం సబ్సిడీతో సరఫరా చేసిన 5.46 లక్షల రొయ్య పిల్లలను వదిలినట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్య శాఖ ఏడీ రాణా ప్రతాప్‌సింగ్, అబ్జర్వర్ రహమాన్, అసిస్టెంట్ అనిల్, భూత్పూర్ రిజర్వాయర్ మత్స్య సహాకార సంఘం అధ్యక్షుడు కిష్టప్ప, రాయప్ప, సురేష్, సాయిలు, సత్యవార్, కాట్రెవ్‌పల్లి, యర్నగన్‌పల్లి, భూత్పూర్ గ్రామాల మత్స్యకార్మికులు పాల్గొన్నారు.