పనులు వేగంగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-15T23:51:33+05:30 IST

‘మన ఊరు - మన బడి’ పనులను వేగవంగా పూర్తి చేయాలని కలెక్ట ర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

పనులు వేగంగా పూర్తి చేయాలి
పెదిరిపాడ్‌ పాఠశాలలో విద్యార్థుల మేదస్సును పరిశీలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ శ్రీహర్శ

- మండలంలో పలు పాఠశాలలు తనిఖీ

మద్దూర్‌, డిసెంబరు 15 : ‘మన ఊరు - మన బడి’ పనులను వేగవంగా పూర్తి చేయాలని కలెక్ట ర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురు వారం మండలంలోని పలు పాఠశాలలను తనిఖీ చేసి, పట్టణంలోని ఉన్నత పాఠశాలలో పనులు ప్రా రంభం కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముం దు పెదిరిపాడ్‌ పాఠశాలకు వెళ్లిన కలెక్టర్‌ ఐదో తర గతి విద్యార్థులను వివిధ అంశాలపై ప్రశ్నించి, వారి నుంచి సమాధానాలు రాబట్టారు. అనంతరం పెదిరి పాడ్‌ కేజీబీవీని సందర్శించగా విద్యార్థులు బొకెతో స్వాగతం పలికారు. పాఠశాలలో అందుతున్న వస తులపై విద్యార్థులను అడిగి తెలసుకున్నారు. వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలని ఏజెన్సీని ఆదేశించా రు. అనంతరం నాగంపల్లి, పల్లెర్ల, జాదరావుపల్లి, దోరేపల్లి, దంగాన్‌పూర్‌ పాఠశాలను తనిఖీ చేసి ‘మన ఊరు - మన బడి’ పనులను పరిశీలించారు. మొదటి విడతలో మంజూరైన పనుల్లో జాప్యం జర గకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల జా ప్యంపై సంబంధిత డీఈ, ఏఈలపై ఆగ్రహం వ్య క్తం చేశారు. ఆర్‌అండ్‌బీ జిల్లా అధికారి రాములు, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి శ్రీనివాస్‌, ఎంపీడీ వో విజయలక్ష్మి ఎంఈవో గోపాల్‌నాయక్‌, ఏఈ విష్ణు పాల్గొన్నారు.

సమయానికే గ్రామాలకు చేరుకోవాలి

నారాయణపేట టౌన్‌ : పంచాయతీ కార్యదర్శు లు సమయానికే గ్రామాలకు చేరుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం మద్దూర్‌ మండ లంలోని కొత్తపల్లి ఎంపీడీవో, పంచాయతీ కార్యద ర్శులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి మా ట్లాడారు. గ్రామాల్లో చేపడుతున్న పనుల వివరాల ను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని, గ్రామాల్లో చెత్త సేకరించి వాటిని డంపింగ్‌ యార్డుకు తరలించి వర్మీ కంపోస్ట్‌ తయారు చేసేలా చూడాలన్నారు. గ్రా మాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు అసౌకర్యం కల్గకుండా చూడాలన్నారు. నర్సరీల్లో పెంచిన మొ క్కలను హరితహరం కోసం వినియోగించాలని, మీ టరుపై మొక్కలనే నాటాలన్నారు. ప్రతీ గ్రామంలో వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ షెడ్‌, ట్రాక్టర్‌ సౌకర్యం కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, డీపీవో మురళి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:51:35+05:30 IST