పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-07T22:40:33+05:30 IST

పురుగు ల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్‌కర్నూల్‌ జి ల్లా ఉప్పునుంతల మండలం పిరట్వాని పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

 పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
రాస్తారోకో చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

ఉప్పునుంతల, డిసెంబరు 7: పురుగు ల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్‌కర్నూల్‌ జి ల్లా ఉప్పునుంతల మండలం పిరట్వాని పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తెలుగుపల్లికి చెందిన లక్ష్మమ్మ(33)కు పి రట్వానిపల్లి గ్రామానికి చెందిన దొడ్ల జంగయ్యతో 15 సంవత్సరాల వివాహం జరిగింది. మూడేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె తన ముగ్గురు కుమార్తెలతో కలిసి పిరట్వానిపల్లి గ్రామంలో ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. కాగా, ఇటీవల ఆమెకు వివాహేతర సంబంధం అంటగట్టి దగ్గరి బంధువులు నిత్యం వేధింపులకు గురి చేస్తుండం తో మనస్ధాపం చెందిన ఆమె మంగళవారం ఉదయం పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన గ్రామస్థులు ఆమెను అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. ప్రథమచికిత్స అనంత రం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి దగ్గు సత్తయ్య ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన దొడ్ల మల్లయ్య, దొడ్ల సుమలత, దొడ్ల బాలయ్య, దొడ్ల బచ్చయ్యలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో

అచ్చంపేట టౌన్‌ : పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న లక్ష్మమ్మ కుటుంబానికి న్యాయం చే యాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబీకులు బుధవారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ ముందు రోడ్డుపై రాస్తా రోకోకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సర్ది చెప్పడంతో రాస్తారోకో విరమించారు.

Updated Date - 2022-12-07T22:40:35+05:30 IST